రాజమహేంద్రవరం రూరల్: దేశ స్వాతంత్య్రం కోసం మహాత్ములు, జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి చేసిన త్యాగం నేటితరానికి ఆదర్శమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత కొనియాడారు. శుక్రవారం బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గాంధీజీ, లాల్‌బహదూర్‌శాస్త్రి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, గిరజాల వీర్రాజు (బాబు), రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అంగాడ సత్యప్రియ, రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి రుకియా సయ్యద్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల చక్రవర్తి, దేవులపల్లి సరితారాణి, వెలగల కళ్యాణిరెడ్డి, షేక్ ఇమామ్, వాసంశెట్టి శ్రీను, వైఎస్ కుమార్, బీదంరాజు తదితరులు పాల్గొన్నారు.


