ప్రజలను మభ్యపెట్టడానికే... | - | Sakshi
Sakshi News home page

ప్రజలను మభ్యపెట్టడానికే...

Oct 3 2026 12:20 AM | Updated on Oct 3 2026 12:20 AM

స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పింఛన్లు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. వాస్తవానికి పింఛన్ల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రజలను మభ్యపెట్టడం కోసం హడావుడిగా దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడేమో ఆంక్షల పేరుతో అర్హులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో సులభంగా పింఛన్లు లభించేవి. ఇప్పుడేమో ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి రెండు మూడు రోజులు ఆలస్యమైనా సరే ఈ నెల నుంచే కొత్త పింఛన్లు అందించాలి.

– అరుణ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి

మోసం చేయడంలో బాబు దిట్ట

ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టడం, మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అనే విషయం అందరికీ తెలిసిందే. అర్హులందరికీ ఒకటో తేదీ నుంచే పింఛన్లు ఇచ్చేస్తామని చెప్పి గొప్పగా ప్రచారం చేశారు. భారీ హోర్డింగ్‌లు పెట్టారు. దరఖాస్తులనే పూర్తి స్థాయిలో పరిశీలించలేదు. ఇంకా పింఛన్లు ఎక్కడ ఇస్తారు. గతంలో వలంటీర్లు ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలోనే ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యేవి. అర్హులందరికీ ఎప్పటికప్పుడు పింఛన్లు లభించేవి.

ప్రస్తుతం పాలకులు, అధికారులకు చిత్తశుద్ధి లేదు.

– తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement