గత ప్రభుత్వంలో వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందాయి. అలాంటి మమ్మల్ని వివిధ పురస్కారాలు, నగదుతో సత్కరించేవారు. గత ఎన్నికల ముందు వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి, దగా చేశారు. ఈ ప్రభుత్వంలో మమ్మల్ని పూర్తిగా పక్కనబెట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరిచిపోయారు. నమ్మించి మోసం చేయడం సరికాదు.
– దుడ్డే సత్యసాయికుమార్, మాజీ వలంటీర్, గాడాల
ప్రాణాలకు తెగించి సేవలు
కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి మరీ రోగులకు సేవలు అందించాం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేశాం. అలాంటి వలంటీర్ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం సరైన విధానం కాదు. మా పట్ల కక్ష వీడి నెలవారీ జీతాలు ఇచ్చే విధంగా మమ్మల్ని తీసుకోవాలి. అప్పుడే ప్రజలకు ప్రభుత్వ పథకాలు దరిచేరి, మేలు జరుగుతుంది.
– నాగా నవీన్‌ప్రసాద్, మాజీ వలంటీర్,
నర్సాపురం, కోరుకొండ మండలం


