సచివాలయ ఉద్యోగుల అరెస్టులు దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగుల అరెస్టులు దుర్మార్గం

Sep 28 2026 12:35 AM | Updated on Sep 28 2026 12:35 AM

రాజమహేంద్రవరం సిటీ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేపడుతుంటే, వారిపై లాఠీచార్జి చేయడం, అరెస్టులకు పాల్పడటం దుర్మార్గమని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను అడుగడుగునా అడ్డుకుని అరెస్టు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్ని ఆంక్షలు విధించినా వేలాది మంది ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారన్నారు. సచివాలయ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉద్యోగ భద్రత కల్పించడం, ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయడం, వేతన సవరణ చేపట్టడం, బదిలీల్లో అక్రమాలను అరికట్టడం, అదనపు పని భారాన్ని తగ్గించడం, సర్వీస్‌ రూల్స్‌ను అమలు చేయడం వంటి 9 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని జక్కంపూడి రాజా హెచ్చరించారు.

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం

రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement