సీటీఆర్‌ఐ: గత ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో మహిళా లోకానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని వారి సంక్షేమానికి అనునిత్యం కృషి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి మార్గాని భరత్ రామ్ కొనియాడారు. స్థానిక నటరాజ్ థియేటర్ వద్ద ఉన్న వీవీ గార్డెన్స్‌లో శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో 300 మంది గర్భిణులకు సామూహికంగా సీమంతం నిర్వహించి వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రొటీన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. తాను ఎంపీగా నగరంలో 25 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలగానే రూ.300 కోట్లు ఇచ్చారని, ఆ డబ్బుతో స్థలాలు కొనుగోలు చేసి ఇస్తే కూటమి పాలకులు వాటిని చిత్తు కాగితాలంటున్నారని, వారికి దమ్ముంటే హైకోర్టుకు వెళ్లి మాపై కేసు వేయగలరా అని ప్రశ్నించారు. కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో ప్రతి పథకాన్ని జగన్ మహిళల పేరుతోనే అమలు చేశారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను ఆయన బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి పనిచేశారన్నారు. నగరంలోని 25 వేల మందికి ఇళ్ల పట్టాలు వచ్చే వరకు పోరాడమన్నారు. త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేస్తారని భరోసా ఇచ్చారు. ఈవీఎం ఎమ్మెల్యే నగరాన్ని సర్వనాశనం చేస్తున్నారని, అభివృద్ధి పేరుతో తాము చేసిన పనులకు ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కార్యక్రమలో ఏపీఐడీసీ స్టేట్ మాజీ డైరెక్టర్ కానుబోయిన సాగర్, వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్, సర్ ప్రక్రియ జిల్లా కో ఆర్డినేటర్ పరమేశ్వరరావు, బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధరరావు, దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, మహిళా నాయకులు పోలు విజయలక్ష్మి, సంకిస భవానీప్రియ, మార్తి లకి్‌ష్మ్, అనంతలకి్‌ష్మ్, వట్టికూటి కృష్ణవేణి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
జగనన్న కాలనీల స్థలాల కొనుగోలుకు రూ.300 కోట్లు ఇచ్చారు
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలి
సూపర్ సిక్స్‌తో చంద్రబాబు దగా చేశారు
300 మందికి సమూహిక
సీమంతాలు, ప్రొటీన్ కిట్ల పంపిణీ
మాజీ ఎంపీ భరత్‌రామ్


