వినాయక ఉత్సవాల్లో పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే పూజిద్దాం. మట్టితో చేసిన గణపతులను పూజించడం ద్వారా అంతా మేలు జరుగుతోంది. వాటి నిమజ్జనం విషయంలో పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలి.
–పొన్నా కృష్ణబాబు,
సిద్ధాంతి, నిడదవోలు
మట్టి గణపతిని పూజిస్తేనే వ్రత ఫలితం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని పూజించడం చాలా లాభదాయకం. ఇందులో సహజ సిద్ధంగా ఉన్న వనములో లభించే పదార్థాలతో స్వామిని ఆరాధించి పూజలు చేయడం ద్వారా వినాయక చవితి వ్రత ఫలితాన్ని పొందగలరని హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. నిమజ్జనం చేస్తే మట్టి విగ్రహాలు ప్రకృతిలో కలిసిపోతాయి.
–శ్రీకాకుళపు లక్ష్మీనరసింహ శాస్త్రి, అర్చకుడు, నిడదవోలు


