రూగోస్ వైట్ ఫ్లై (సర్పిలాకార తెల్లదోమ) కొబ్బరిని అత్యంత ఎక్కువగా దెబ్బ తీసింది. తమిళనాడులోని పొల్లాచ్చి ప్రాంతంలో 2018లో మొదలైన తెల్ల దోమ ఉధృతి దేశమంతా వ్యాపించింది. ఇది కొబ్బరి నుంచి అరటి, ఇతర పంటలతో పాటు కడియం నర్సరీలకు కూడా వ్యాపించింది. దీనివల్ల 30 శాతం దిగుబడి తగ్గిపోయిందని అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెప్పారు. కొబ్బరి తోటలో లక్షల సంఖ్యలో ఆశిస్తున్న దోమలు పచ్చదనాన్ని హరిస్తూ చెట్టును బలహీనపరుస్తున్నాయి. పలు రకాల నివారణ చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేదు. దీని ఉధృతి ఇప్పటికీ అధికంగానే ఉంది.


