దోషులను శిక్షించాలని వైఎస్సార్ సీపీ
సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి డిమాండ్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంగళవారం గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. మోటారు సైకిల్‌పై వచ్చిన వారు వెంట తెచ్చుకున్న పెట్రోలను విగ్రహంపై పోశారు. ఆయన కాళ్ల వద్ద నిప్పు పెట్టారు. దీనిని గమనించిన మెయిన్ రోడ్డులోని కొందరు దుకాణదారులు వెంటనే పరుగు పరుగున వచ్చారు. దీంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో వైఎస్సార్ విగ్రహం కాళ్ల వద్ద పెట్టిన మంటకు నల్లగా మారిపోయింది. స్థానిక దుకాణదారులు విగ్రహం పైనుంచి నీళ్లను పోసి కడిగారు.
ఫ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నమహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నిప్పు పెట్టారంటే, వారిని క్షమించకూడదని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ఈ దుశ్యర్యకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్ విగ్రహం వద్దకు విజయలక్ష్మితో పాటు పార్టీ శ్రేణులు చేరుకున్నారు. జోహార్ వైఎస్సార్, దోషులను శిక్షించాలి, వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. సీపీ పుటేజీ ఆధారంగా నిందితుడిని మూడో పట్టణ పోలీసులు గుర్తించారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ వర్రే అప్పారావు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పార్లమెంట్ జిల్లా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, అడపా రాజు, కందకం శ్రీను పాల్గొన్నారు.


