సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు సన్నాహకంగా అక్టోబర్ 12న కాకినాడ జేఎన్‌టీయూలో సీఐఐ ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఇందులో పరిశ్రమలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులు, నూతన ఆవిష్కరణలను జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పరిచయం చేసేందుకు ఈ సదస్సు చక్కటి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. సముద్ర రవాణా, ఓడల నిర్మాణం, అమ్మోనియా, ఆక్వా ఎగుమతులు, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్ తదితర ప్రాధాన్య రంగాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. సదస్సులో ప్రత్యక్షంగా ఉత్పత్తులను ప్రదర్శించగల 20 తయారీ రంగ ఎంఎస్‌ఎంఈలకు, మార్కెట్‌కు సిద్ధంగా ఉన్న పరిష్కారాలను కలిగిన ఐదు స్టార్టప్‌లు, సేవా సంస్థలకు స్టాల్స్ కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన ఉత్తమ పరిశ్రమలను విశాఖపట్నంలో జరిగే ప్రధాన సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రదర్శనకు ఎంపిక చేసే అవకాశం ఉంటుందని వివరించారు. పారిశ్రామికవేత్తలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పెట్టుబడిదారులతో నేరుగా సమావేశమై తమ ఉత్పత్తులు, వ్యాపార అవకాశాలను వివరించవచ్చన్నారు. అర్హత కలిగిన ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, నూతన పారిశ్రామికవేత్తలు ఈ నెల 5 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 11న జిల్లా స్థాయి పరిశీలన, ఎంపిక, 20లోగా అవసరమైన పత్రాల సమర్పణ, 25న తుది జాబితా సమర్పణ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. వివరాలకు జిల్లా పరిశ్రమల అధికారి వనిధర్ రామన్ 94402 68563, ఇండస్ట్రీస్ ప్రమోషన్‌అధికారి సూర్య ప్రకాష్ 81435 79333 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
ఫ స్థానిక పరిశ్రమలు
భాగస్వాములు కావాలి
ఫ కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపు


