ఉచిత విద్యుత్‌తో సాగుకు భరోసా | - | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యుత్‌తో సాగుకు భరోసా

Sep 2 2026 12:12 AM | Updated on Sep 2 2026 12:12 AM

వరుస కరవుతో 2004కు ముందు రైతులు కష్టాలు పడేవారు. నాటి పాలకులు వ్యవసాయం దండగ అని మార్చేశారు. సాగుకు నోచుకోక పంట పొలాలు బీడు భూములుగా మారాయి. మరోవైపు విద్యుత్‌ చార్జీల మోతతో వ్యవసాయం కష్టంగా మారింది. అటువంటి సమయంలో అధికారం చేపట్టిన వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ను అందించి వ్యవసాయాన్ని పండగ చేశారు.

– కుంటముక్కల కేశవ నారాయణ, మలకపల్లి, తాళ్లపూడి

పైసా ఖర్చు లేకుండా..

కుటుంబానికి పెద్ద దికై ్కన నాన్న షేక్‌ షౌకత్‌ లారీ డ్రైవర్‌గా పని చేస్తూ ఇల్లు గడిపేవారు. దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్‌ ఆస్పత్రిలో రూ.లక్షలు అయ్యే చికిత్సను వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా రాజమహేంద్రవరంలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో పైసా ఖర్చు లేకుండా ఉచితంగా పూర్తి చేశారు.

–షేక్‌ సుబేదర్‌, సమిశ్రగూడెం, నిడదవోలు

అప్పుల నుంచి విముక్తి

నాకున్న మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసినప్పటికీ నాటి కరవు పరిస్థితుల వల్ల కలిసిరాలేదు. బ్యాంకులో తీసుకున్న రూ.1.5 లక్షల అప్పు తీర్చలేకపోయాను. వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలుతో పాటు వడ్డీ కూడా మాఫీ చేయించారు. తర్వాత మళ్లీ కొత్తగా రుణం ఇప్పించారు. మహానేత వైఎస్సార్‌ దయ వల్ల అప్పుల నుంచి విముక్తి పొందాను.

– జొన్నలగడ్డ సత్యనారాయణ, మిర్తిపాడు, సీతానగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement