బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలి

Sep 2 2026 12:12 AM | Updated on Sep 2 2026 12:12 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్య రంగాలు, సంక్షేమ పథకాల అమలులో బ్యాంకర్లు మరింత సమన్వయంతో పని చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘ స్వరూప్‌ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో త్రైమాసిక జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) సమావేశం నిర్వహించారు. జూన్‌ 30 నాటికి బ్యాంకింగ్‌ రంగం సాధించిన పురోగతిని సమీక్షించారు. కౌలు రైతులకు రుణాల మంజూరులో మరింత పురోగతి సాధించాలని జేసీ బ్యాంకర్లను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే వి.జోగేశ్వరరావు, యూనియన్‌ బ్యాంక్‌ రీజినల్‌ హెడ్‌ ఎ.విశ్వేశ్వరరావు, జిల్లా లీడ్‌ మేనేజర్‌ డీవీ ప్రసాద్‌, రిజర్వ్‌ బ్యాంక్‌ ఏజీఎం దాసరి కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement