మలికిపురం: మండలంలోని తూర్పుపాలెంలో సుమారు ఐదు ఎకరాల్లో సరుగుడు తోటలకు నిప్పు అంటుకుంది. మొగలి డొంకలు అంటించిన క్రమంలో పక్కనున్న సుమారు ఐదు ఎకరాల సరుగుడు తోటలకు మంటలు వ్యాపించాయి. వీటితో పాటు కొన్ని కొబ్బరి చెట్లు మామిడి చెట్లు, జీడి మామిడి చెట్లు కూడా దగ్ధమైనట్టు రైతులు చెబుతున్నారు. అడబాల వెంకట నరసయ్య, అడబాల సత్యనారాయణ మూర్తి, అడబాల రామ్మూర్తి, నాగమోహన్రావు, అడవుల వెంకటేశ్వరరావు, నల్లి గణేశ్వరరావు తదితర రైతులకు సంబంధించిన తోటలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్టు ప్రాథమిక అంచనా వేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.


