మామిడికుదురు: బి.దొడ్డవరం మధ్యలంకలో విడిది చేసిన విదేశీ వలస పక్షులు ‘ఏషియన్ ఓపెన్ బిల్ స్కార్ట్స్’పై వేటగాళ్లు పంజా విసురుతున్నారు. మధ్యలంకలో తుమ్మచెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకున్న వీటిని వారు వేటాడి సొమ్ము చేసుకుంటున్నారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. వాటిని పట్టుకుని ఇతర గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాల వద్ద బహిరంగంగా విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఒకొక్క కొంగను రూ.300 నుంచి రూ.400కు విక్రయిస్తున్నారని పక్షి ప్రేమికులు వాపోతున్నారు. అరుదైన పక్షుల రక్షణకు చర్యలు తీసుకుని, వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


