కపిలేశ్వరపురం (మండపేట): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మండపేట పట్టణంలో శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి పెద్ద కాలువ వంతెన నుంచి ప్రధాన రహదారిలో రాజారత్న సెంటర్, బస్టాండ్, కలువపువ్వు సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగింది. మండపేట పట్టణం, రూరల్, రాయవరం, అనపర్తి, బిక్కవోలు, కపిలేశ్వరపురం మండలాల ఉపాద్యాయులు పాల్గొన్నారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పి.సురేంద్ర మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాలన్న నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సాధ్యం కాని పరిస్థితుల్లో అర్హత మార్కులను తగ్గించాలని, పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్ చేశారు.


