రామచంద్రపురం రూరల్: 2011 సంవత్సరానికి ముందు నియమితులైన ఉపాధ్యాయులందరికీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నుంచి మినహాయింపునివ్వాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రామచంద్రపురంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్పెషల్ టెట్ అని ప్రభుత్వం చెబుతున్నా అందులో స్పెషల్ ఏమీ లేదని విమర్శించారు. టెట్‌లో అందరికీ ఉత్తీర్ణత 40 శాతం మార్కులకు కుదించాలని, ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించాలని, బోధించే సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ పైనే పరీక్షలు ఉండాలని సూచించారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి


