ఫ లక్షణంగా గాజులతో అలంకరణ | - | Sakshi
Sakshi News home page

ఫ లక్షణంగా గాజులతో అలంకరణ

Aug 28 2026 12:15 AM | Updated on Aug 28 2026 12:15 AM

గౌతమీ గోదావరి తీరాన కడియపులంకలో ఉన్న శ్రీ హరిహర మహా క్షేత్రంలో కొలువుదీరిన శ్రీ అపర్ణాదేవి అమ్మవారిని.. శ్రావణ పౌర్ణమి సందర్భంగా లక్ష గాజులతో గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ చైర్మన్‌ మార్గాని సత్యనారాయణ, ప్రధానార్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యాన ఈ అలంకరణ జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యాన భక్తులకు క్షీరాన్న ప్రసాదం వితరణ చేశారు. అమ్మవారి ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్షేత్రంలో కొలువైయున్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం వద్ద కూడా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యాన మహా అన్నదానం నిర్వహించారు.

– కడియం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement