స్పెషల్‌ టెట్‌లో అసంబద్ధతలు సరి చేయాలి | - | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ టెట్‌లో అసంబద్ధతలు సరి చేయాలి

Aug 28 2026 12:15 AM | Updated on Aug 28 2026 12:15 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): స్పెషల్‌ టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌(టెట్‌)లో అసంబద్ధతలను వెంటనే సరి చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయులు గురువారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపి, కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకుడు కేవీ శేఖర్‌ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల వయస్సు, కంప్యూటర్‌ వినియోగంలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టెట్‌ పరీక్షను ఆఫ్‌లైన్‌ పద్ధతిలోనే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుడు బోధిస్తున్న సబ్జెక్టు పైనే పరీక్ష నిర్వహించాలన్నారు. సంబంధం లేని అంశాలతో పరీక్షలు నిర్వహించడం అశాసీ్త్రయమన్నారు. పరీక్షలో కేటగిరీలతో సంబంధం లేకుండా అందరికీ ఒకేవిధంగా న్యాయబద్ధమైన పాస్‌ మార్కులు నిర్ణయించాలని కోరారు. తమిళనాడు ప్రభుత్వం తరహాలోనే మన రాష్ట్ర శాసనసభలో కూడా టెట్‌పై ప్రత్యేక తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం మరింత ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మణరావు, దానియేలుబాబు, ఆర్థిక కార్యదర్శి అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement