రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ జట్టు ఎంపికలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ జట్టు ఎంపికలు ప్రారంభం

Aug 26 2026 12:12 AM | Updated on Aug 26 2026 12:12 AM

అమలాపురం టౌన్‌: ఏపీ సబ్‌ జూనియర్‌ అండర్‌–13 బాలుర బాస్కెట్‌బాల్‌ జట్టు ఎంపికలు స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా స్థలంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ ఒకటో తేదీ వరకూ జరిగే ఈ ఎంపిక పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి జట్లు వచ్చాయని కోచ్‌, ఏపీ బాస్కెట్‌బాల్‌ క్రీడా సలహాదారు నడింపల్లి అప్పలరాజు తెలిపారు. ఈ జట్లకు ప్రతి రోజూ బాస్కెట్‌బాల్‌లో శిక్షణ ఇస్తామని, చివరిగా రాష్ట్ర జట్టును ఎంపిక చేస్తామని చెప్పారు. విజయవాడలో సెప్టెంబర్‌ 26న జరగనున్న జాతీయ స్థాయి అండర్‌–13 బాలుర బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఇక్కడ ఎంపిక చేసే రాష్ట్ర జట్టు తలపడుతుందని వివరించారు.

కార్యక్రమంలో జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సంసాని గంగాధరరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు ఈఆర్‌ సుబ్రహ్మణ్యం, వైఎఎస్సార్‌ సీపీ అమలాపురం పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, వ్యాయామోపాధ్యాయులు కుడుపూడి బుజ్జి, యనమదల బుజ్జి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement