ఐక్యతే సామాజిక బలం | - | Sakshi
Sakshi News home page

ఐక్యతే సామాజిక బలం

Aug 24 2026 12:25 AM | Updated on Aug 24 2026 12:25 AM

కోరుకొండ: ఐక్యతే గవర సామాజిక వర్గానికి బలమని వైఎస్సార్‌ సీపీ అనకాపల్లి మాజీ ఎంపీ బీశెట్టి సత్యవతి అన్నారు. ఆదివారం స్థానిక శ్రీరంగపట్నంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల గౌరి (గవర) సేవా సంఘం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గాలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. తనకు గతంలో ఎంపీ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘ నూతన అధ్యక్షుడు తనకాల వెంకటరమణ, ఆయన సతీమణి నాగమణిలను ఆమె శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాజీ ఎంపీ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా తనకాల వెంకటరమణ మాట్లాడుతూ తనకు అధ్యక్షుడిగా మళ్లీ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ ఉపాధ్యక్షుడు కొయిడాల వెంకటగణపతి, ఏఎంసీ చైర్మన్‌ తనకాల వెంకటరమణమ్మ, ఎంపీటీసీ సభ్యుడు తనకాల నూకరాజు, సంఘ నాయకులు తనకాల నాగేశ్వరరావు, మద్దాల రమణ, కొయిడాల నానాజీ, బుద్దా శ్రీను, కామరాజు, సూరిశెట్టి భాస్కర్‌, తనకాల నూకరాజు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement