కాకినాడ లీగల్: కోర్టుల్లో న్యాయవాదులు, కక్షిదారుల సమయాన్ని ఆదా చేసేలా ఆధునిక సాంకేతికతను మరింతగా వినియోగించాలని, న్యాయస్థానాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు కోరారు. ఈ మేరకు ఆదివారం కాకినాడలోని ఓ ఫంక్షన్ హాల్లో బార్ అసోసియేషన్ల సమైక్య సదస్సు నిర్వహించారు. కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పెన్మెత్స రామచంద్రరాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో న్యాయవాదుల సంఘాల నాయకులు, సీనియర్ న్యాయవాదులు పలు అంశాలపై చర్చించారు. కోర్టు భవనాల్లో మౌలిక సదుపాయాలు, న్యాయవాదులు, కక్షిదారులకు అనుకూలమైన వసతులను మెరుగుపరచాలని సమావేశంలో కోరారు. న్యాయవాదుల సమస్యలను ఉమ్మడి జిల్లా న్యాయవాదుల సంఘాల రాజమహేంద్రవరం ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు.
ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ల తీర్మానం


