వృత్తి : స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అయినవిల్లి మండలం నల్ల చెరువు జెడ్పీ ఉన్నత పాఠశాల.
రిఫరీగా అర్హత: వెటరన్ రిఫరీ దివంగత రంకిరెడ్డి కాశీ విశ్వనాథం సూచనతో 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మంలో జరిగిన స్టేట్ అంపైర్ పరీక్షలో ఉత్తీర్ణత. 2013లో కటక్‌లో గ్రేడ్–2, 2019లో గ్రేడ్–1 నేషనల్ అంపైర్‌గా ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ టెక్నికల్ అఫీషియల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు. అలాగే బ్యాడ్మింటన్ ఇండియా టెక్నికల్ అఫీషియల్స్ అసోసియేషన్ దక్షిణ భారతదేశ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు.
రిఫరీగా అనుభవం: 15 ఏళ్లు
అత్యుత్తమ ప్రాతినిధ్యం
● థామస్ – ఉబెర్ కప్ ఫైనల్స్.
● ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రపంచ టీమ్ ఛాంపియన్ షిప్.
● వరల్డ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్, ఢిల్లీ.
● బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్.
● హైదరాబాద్‌లో 37వ జాతీయ క్రీడలు.
● గోవా, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2020.
● ఒడిశా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2026.


