అపర భగీరథునికి అవమానం | - | Sakshi
Sakshi News home page

అపర భగీరథునికి అవమానం

Jul 25 2026 12:11 AM | Updated on Jul 25 2026 12:11 AM

నివాళులర్పించడంలో అధికారుల అలసత్వం

ధవళేశ్వరం: ఆనకట్ట నిర్మాణం ద్వారా డెల్టాను ధాన్యాగారంగా మార్చిన అపర భగీరథుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ను నీటిపారుదల అధికారులు విస్మరించడం శోచనీయం. ఆయన వర్ధంతి సందర్భంగా కనీసం ఆయన విగ్రహానికి పూలమాల వేసేవారే కరువయ్యారు. గత మే నెలలో జయంతి సందర్భంగా కాటన్‌ మహాశయుని విగ్రహానికి వేసిన పూలమాలలను నేటికీ తీయకపోవడం బాధాకరం. స్థానిక ఎస్‌ఈ కార్యాలయం ఎదురుగా పాత తూర్పు డివిజన్‌ కార్యాలయం పక్కన ఉన్న కాటన్‌ విగ్రహం వద్ద సైతం ఇదే పరిస్థితి. ఆయన విగ్రహం ఉన్న ప్రాంతంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయినా కనీసం తొలగించేవారు లేకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement