కట్టెల పొయ్యిలు మళ్లొచ్చాయి. గ్యాస్ కొరత పుణ్యమాని ఆ పొయ్యిలతో వంటలు చేసే పరిస్థితి ఎదురైంది. ఇంటా బయటా అదే దుస్థితి. గతంలో అన్నదానాలకు గ్యాస్ పొయ్యిలే వాడేవారు. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరంలో ఇలా కట్టెల పొయ్యిలు వాడుతూ అవస్థలు పడ్డారు. హోటళ్లలో గ్యాస్ కొరత కారణంగా మూసి వేస్తున్నట్లు బోర్డులు పెట్టారు. మరోపక్క కర్రీ పాయింట్లలో రూ.10 ఉండే కూర అమాంతంగా పెంచేసి రూ.25కు విక్రయిస్తున్నారు. – పిఠాపురం
ఏకే మల్లవరంలో అన్నదానానికి కట్టెల పొయ్యిలపై వంటలు
మామిడి పండ్లను ఇష్టపడని వారుండరు. మామిడి చెట్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటేనే చీడపీడల నుంచి రక్షణ పొందవచ్చు. అచ్చం అలానే కొత్తపల్లిలో ఓ ప్రకృతి వ్యవసాయ రైతు ఉల్లి సురేష్ తన పొలంలో ఉన్న కొబ్బరి మామిడి చెట్టు కాయలకు ఇలా కవర్లు కట్టి ఓ రక్షణ కవచం ఏర్పాటు చేశారు. చీడపీడలు ఆశించకుండా, మచ్చలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. – పిఠాపురం


