పంచాయతీ స్వీపర్‌ నిజాయతీ | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ స్వీపర్‌ నిజాయతీ

Mar 2 2026 8:14 AM | Updated on Mar 2 2026 8:14 AM

పంచాయ

పంచాయతీ స్వీపర్‌ నిజాయతీ

మామిడికుదురు: పాశర్లపూడిలంక గ్రామ పంచాయతీ స్వీపర్‌ రాయుడు ప్రసాద్‌ తనకు దొరికిన రూ.లక్ష విలువైన ఎనిమిది గ్రాముల బంగారు గొలుసును బాధితుడికి ఇచ్చి నిజాయతీ చాటుకున్నారు. పంచాయతీ కార్యదర్శి దాకే సురేష్‌కు చెందిన బంగారు గొలుసు శనివారం పడిపోయింది. దాని కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. పంచాయతీ స్వీపర్‌ ప్రసాద్‌ ఆదివారం పంచాయతీని తుడుస్తుండగా అతనికి ఆ గొలుసు దొరికింది. దానిని బాధితుడి బంధువుకు అప్పగించి తన నిజాయతీని నిరూపించుకున్నారు. ప్రసాద్‌ను గ్రామ సర్పంచ్‌ తెలగారెడ్డి సూర్యప్రకాశరావుతో పాటు గ్రామస్తులు అభినందించారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడి మృతి

కొత్తపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన ఓసిపల్లి దుర్గాప్రసాద్‌ (17), మాయాపట్నానికి చెందిన ఓసిపల్లి జాన్‌లు మోటారు సైకిల్‌పై కోనపాపపేట వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పాడ నుంచి కోనపాపపేట వైపు వెళుతున్న ఆటో పొన్నాడ శివారు శీలంవారిపాలెం బ్రిడ్జి సమీపంలో ఆటో అతి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన జాన్‌ను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పంచాయతీ స్వీపర్‌ నిజాయతీ 1
1/1

పంచాయతీ స్వీపర్‌ నిజాయతీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement