బ్రెయిలీ నాణేల సేకరణలో అవార్డు
అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన అంధురాలు, వాకర్స్ జోన్ చైర్‌పర్సన్ పుత్సా రాజేశ్వరి నాణేల సేకరణలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ –2026 సొంతం చేసుకున్నారు. లూయిస్ బ్రెయిలీ నాణేల సేకరణలో ఈ అవార్డుకు అర్హత సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా బెల్జియం, బ్రెజిల్, ఈక్వెడార్, ఐల్ ఆఫ్ మ్యాన్, ఇటలీ, పోలెండ్, థాయ్‌లాండ్, అమెరికా దేశాలతో పాటు మన దేశానికి సంబంధించి 2009లో బ్రెయిలీ ముఖ చిత్రంలో విడుదలైన రూ.2, రూ.100తో పాటు మొత్తం పది దేశాలకు చెందిన 14 నాణేలను సేకరించడం ద్వారా ఆమె ఈ రికార్డు పొందారు. రాజేశ్వరి అవార్డు సాధించడం పట్ల వాకర్స్ జిల్లా గవర్నర్ తోలేటి సూర్యనారాయణ, సంస్కార భారతి జిల్లా అధ్యక్షురాలు శ్రీగిరి పద్మావతి, నాణేల సేకరణకర్తలు నడంపల్లి రామరాజు, ఇవటూరి రవి సుబ్రహ్మణ్యం, పి.వెంకటనారాయణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
తనకు వచ్చిన లిమ్కా బుక్ ఆఫ్ అవార్డును చూపుస్తున్న రాజేశ్వరి


