విచ్చలవిడిగా పాలాహలం! | - | Sakshi
Sakshi News home page

విచ్చలవిడిగా పాలాహలం!

Feb 24 2026 7:20 AM | Updated on Feb 24 2026 7:20 AM

విచ్చ

విచ్చలవిడిగా పాలాహలం!

పొదుగులోనే విషాన్ని పొదుగుతున్న వైనం

కృత్రిమ రసాయనాలతో తయారీ

జాగ్రత్త తీసుకోవాలంటున్న

ఫుడ్‌ సేఫ్టీ అధికారులు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పాల కల్తీ ఐదు ప్రాణాలను పొట్టన పెట్టుకొని, 19 మందిని ఆస్పత్రి పాలు చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. యావత్తు రాష్ట్రాన్ని రాజమహేంద్రవరం వైపు చూసేలా చేసింది. లాలాచెరువు ప్రాంతం చౌడేశ్వరి నగర్‌, స్వరూప్‌ నగర్‌, వెంకటేశ్వర నగర్‌లలో కల్తీ పాల విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయనే వార్తల నేపథ్యంలో పాలు చూస్తేనే జనం అనుమానించే పరిస్థితి నెలకొంది. మనం తాగే పాలలో అసలు, నకిలీని పోల్చుకొనేదెలా అనే సందేహాలు ఏర్పడుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు పాలను సైతం విచ్చలవిడిగా కల్తీ చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడడం ఆందోళన కలిగించే అంశం.

అధిక దిగుబడి కోసం ఆవులకు ఇంజెక్షన్లు

పాల అధిక దిగుబడి కోసం ఆక్సిటోసిన్‌ మందును ఆవు పొదుగు నుంచే ఇస్తున్నారు. పాడి పశువులకు ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు చేయించేవారికి అవి ఇచ్చే పాలధారలు కాసులు కురిపించవచ్చు. కానీ అవే ధారలు తాగినవారి ఆరోగ్యాన్ని కాటేసే పాము కోరలుగా మారిపోతాయని వైద్యులు చెబుతున్నారు. ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్‌ చేసిన పశువు ఇచ్చే పాలు తాగిన వారికి కేన్సర్‌ వచ్చే అవకాశం అధికం. కిడ్నీలు పాడవుతాయి. నాడీ వ్యవస్థ దెబ్బ తింటుంది. 19 ఏళ్లు వచ్చినా బాలికలు రజస్వల కారు. చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. మహిళలకు రుతుస్రావ ఇబ్బందులు ఏర్పడతాయి. పశువులు ఇచ్చే పాల దిగుబడిని పెంచడానికి వాటికి చేసే ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు అత్యంత ప్రమాదకరమైనవి. పాలను విషంగా మార్చి, ప్రాణాంతక వ్యాధులు కలిగిస్తాయి. అయితే లాభమే ధ్యేయంగా పాలు అమ్ముకునే కొందరు రైతులు, పాల విక్రయానికే వ్యాపార స్థాయిలో పశువులను పెంచే వారు ఈ ఇంజెక్షన్లను నిస్సంకోచంగా పశువులకు చేయిస్తున్నారు. రాష్ట్రంలో నిషేధం ఉన్న ఈ ఇంజెక్షన్లను కొందరు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై గతంలో పలుమార్లు సాక్షి దినపత్రిక కథనాలు ప్రచురించడంతో ఔషధ నియంత్రణ శాఖాధికారులు దాడులు నిర్వహించి అధిక సంఖ్యలో ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లను పట్టుకున్నారు.

ఇలా కనిపెట్టవచ్చు

కొద్ది పాలను తీసుకుని అయోడిన్‌ రెండు చుక్కలు వేస్తే పాలంతా నీలం రంగులోకి మారితే ఆ పాలలో కల్తీ జరిగినట్టే. చేతిలోకి కొన్ని పాలు తీసుకుని రెండు చేతులతో రుద్దుకుంటే మధ్యలో పిండిలా వస్తే కల్తీ జరిగినట్టే. పాలు చిన్న బాటిల్‌లో వేసి గట్టిగా ఊపినప్పుడు నురగ వచ్చినా, పాలు పొయ్యి మీద కాస్తున్నప్పుడు ఎక్కువగా నురగ వచ్చినా అందులో డిటర్జెంట్‌ కలిసినట్టే.

స్పాట్‌ కిట్‌లు వస్తున్నాయి

కల్తీ పాలను కనిపెట్టేందుకు పుడ్‌ సేఫ్టీ విభాగం కిట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మ్యాజిక్‌ బాక్స్‌ పేరుతో కిట్‌లను ఆహార తనిఖీ అధికారులకు అందిస్తున్నారు. ఇవి బయట తక్కువ ధరకే లభించనున్నాయి. త్వరలో ప్రజలు వాడుకోవడానికి ఇవి అందుబాటులోకి రానున్నాయి.

లూజుగా అమ్మే పాలకే కల్తీ అవకాశం

లూజుగా అమ్మే పాలలో కల్తీ జరిగే అవకాశం అధికంగా ఉంటుంది. యూరియా, నూనెలు, డిజర్జెంట్లు కలిపి పాలను తయారు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. పాలు పాడైపోకుండా ఫార్మాల్‌ డిహైడ్‌ లిక్విడ్‌ను కలుపుతారు. దీనివల్ల పాలు తొందరగా పాడవకుండా, విరిగి పోకుండా ఉంటాయి. దీంతో ఆ పాలు రెండు రోజులైనా పాడవ్వవు. వీటిపైనా తనిఖీలు నిర్వహిస్తాం.

– నందాజీ,

అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌, కాకినాడ

పాల కల్తీ ఇలా..

గేదె పాలు, ప్యాకెట్‌ పాలు మాత్రమే మనకు తెలు సు. అయితే ఇప్పుడు కొందరు పాల వ్యాపారులు సింథటిక్‌ పాలు విచ్చలవిడిగా పోస్తున్నారు. వీటిని కేవలం రసాయనాలు ఉపయోగించి తయారు చేస్తున్నారు. పాలలో ప్రధానంగా యూరియా కలుపుతారు. నీళ్ల పాలను చిక్కదనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. పాలు పుల్లగా అయిపోతే ఆ రుచి ని మార్చడానికి డిటర్జెంట్లు, సబ్బులు, షాంపులు వా డుతున్నారు. పాలు జిడ్డుగా, కొవ్వుగా ఉండటానికి నూనెలు కలుపుతున్నారు. పాల సాంద్రతను పెంచడానికి గంజి వాడుతున్నారు. పాలు అధిక రోజులు నిల్వ ఉండటానికి, అందులో బ్యాక్టీరియా పెరగకుండా ఉండటానికి హైడ్రోజన్‌ పెరాకై ్సడ్‌ వాడుతున్నారు. లాక్టోమీటరులో పాల ఉత్తీర్ణత శాతం చూపించడానికి అమ్మోనియా సల్ఫేట్‌, తెల్లగా ఉండటానికి తెలుపు పెయింట్‌ వాడుతున్నారు. పాలలో పొటాషియం క్రోమేట్‌, సిల్వర్‌ నైట్రేట్‌ కలిపితే పసువు రంగు వస్తే వాటిలో సోడియం క్లోరైడ్‌ కలిపినట్లే.

విచ్చలవిడిగా పాలాహలం!1
1/3

విచ్చలవిడిగా పాలాహలం!

విచ్చలవిడిగా పాలాహలం!2
2/3

విచ్చలవిడిగా పాలాహలం!

విచ్చలవిడిగా పాలాహలం!3
3/3

విచ్చలవిడిగా పాలాహలం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement