టీడీపీకి సుంకరపాలెం సర్పంచ్ రాజీనామా
పార్టీ నాయకుల వేధింపులే కారణమని వెల్లడి
తాళ్లరేవు: మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు, సుంకరపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ టిళ్లపూడి నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. సోమవారం ఆయన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో టిళ్లపూడి మాట్లాడుతూ తాను వైఎస్సార్ సీపీ మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందానన్నారు. అయితే 2024 ఎన్నికల ముందు గ్రామాభివృద్ధే ధ్యేయంగా స్థానిక నాయకులు, ప్రజల ఆకాంక్షల మేరకు టీడీపీలో చేరినట్లు తెలిపారు. ఐదేళ్లపాటు సర్పంచ్‌గా విశేష సేవలందించానన్నారు. అయితే స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు కొందరు తనపై లేనిపోని బురద జల్లుతూ, దాడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తనపై పోటీచేసి ఓటమి పాలైన టీడీపీ సీనియర్ నాయకుడు మోపూరి వెంకట రెడ్డినాయుడు గ్రూపు రాజకీయాలతో తనపై అనేక ఫిర్యాదులు చేస్తూ మానసికంగా కుంగదీస్తున్నట్లు తెలిపారు. తన సొంత స్థలంలో నిర్మాణాలు చేయకుండా అడ్డుకోవడంతో పాటు దుర్భాషలాడుతూ వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది టీడీపీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
వ్యక్తి ఆత్మహత్య
రామచంద్రపురం: స్థానిక కమ్మవారి సావరానికి చెందిన గుత్తుల భీమేశ్వరరావు (55) ఆదివారం రాత్రి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు రామచంద్రపురం సీఐ వెంకటనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం పొదల్లో కాలిన గాయాలతో మృతదేహం ఉందని సమాచారం రావడంతో, ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టామన్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రప్పించి దర్యాప్తు చేయడంతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన తరువాత కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదివారం రాత్రి బంకులో పెట్రోలు కొనుగోలు చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
బైక్‌లు ఢీ: వ్యక్తి మృతి
అనపర్తి: మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, భార్యాభర్తలకు తీవ్ర గాయాల ఙయ్యాయని అనపర్తి ఎస్సై ఎల్.శ్రీనునాయక్ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గ్రామానికి చెందిన పువ్వల కై లాసరావు (24) మండపేట మండలం అర్తమూరులోని డైరీఫారంలో పని చేస్తున్నాడు. అతని భార్య చెల్లూరులోని ఉండడంతో అర్తమూరు నుంచి బైక్‌పై బయలు దేరాడు. ఈ నేపథ్యంలో పెడపర్తిరేవు నుంచి పులగుర్త గ్రామానికి వెళ్లే రోడ్డులో భార్యాభర్తలు దివ్యజ్యోతి, రామకృష్ణారెడ్డిలు బైక్ వెళ్తున్నారు. వీరి బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. పువ్వల కై లాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. దివ్యజ్యోతి, రామకృష్ణారెడ్డిలకు తీవ్ర గాయాలు కావడంతో మండపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అనపర్తి ఏఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.
టీడీపీకి సుంకరపాలెం సర్పంచ్ రాజీనామా


