ఇదిగో టమాట! | - | Sakshi
Sakshi News home page

ఇదిగో టమాట!

Feb 23 2026 7:34 AM | Updated on Feb 23 2026 7:34 AM

ఇదిగో

ఇదిగో టమాట!

ఇదిగో ట‘మాట’ అండి.. చెర్రీ పండ్లను పోలిన చెర్రీ టమాటాలు. వీటినే పూర్వం ఎక్కువగా వాడేవారు. కానీ హైబ్రీడ్‌ రకాలు అందుబాటులోకి రావడంతో పాటు పెద్ద సైజు టమాటాలకు జనం అలవాటు పడ్డారు. అయితే ప్రస్తుతం దేశవాళీ రకం చెర్రీ టమాటాలను గొల్లప్రోలు మండలం దుర్గాడ గుండ్ర శివచక్రం ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నారు. ఈ రకం టమాటా మొక్క పాదులా విస్తరించి గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తోంది. ఇవి గుండ్రని (గోళీల సైజులో), ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు, లేదా నారింజ రంగులో ఉంటాయి. ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషక విలువలు ఉంటాయని చెబుతాయి. విటమిన్‌ ఏ, సీ, ఈ, కే, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిలోని లైకోపీన్‌ మరియు పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. వీటిని సలాడ్లు, సలాడ్‌ డ్రెస్సింగ్‌లు, పాస్తా, ఇతర వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. –పిఠాపురం

ఇదిగో టమాట!1
1/2

ఇదిగో టమాట!

ఇదిగో టమాట!2
2/2

ఇదిగో టమాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement