ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు

Feb 23 2026 7:34 AM | Updated on Feb 23 2026 7:34 AM

ప్రపం

ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు

కాకినాడ రూరల్‌: మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు అమలాపురం వేదిక కానుంది. ఈ నెల 28, మార్చి 1వ తేదీల్లో రెండు రోజుల పాటు కిమ్స్‌ వైద్య కళాశాల వేదికగా నిర్వహించనున్న తెలుగు మహాసభలకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరవుతారని గోదావరి గ్లోబల్‌ విశ్వ విద్యాలయం చాన్సలర్‌ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) తెలిపారు. సర్పవరం గ్రామంలోని ఆవాస వన్‌ అపార్ట్‌మెంట్‌ ఆవరణలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చిన్న వయసు నుంచే తెలుగు భాషపై మక్కువ చూపాలని, ఈసారి తెలుగు మహాసభలను గోదావరి గ్లోబల్‌ విశ్వవిద్యాలయం, కిమ్స్‌ వైద్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని ఆయన కోరారు.

నేడు ‘డయల్‌ యువర్‌

ఈపీడీసీఎల్‌ సీఎండీ’

సాక్షి, విశాఖపట్నం: డిస్కమ్‌ పరిధిలోని విద్యుత్‌ సంబంధిత సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో సోమవారం ‘డయల్‌ యువర్‌ ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ పృథ్వీతేజ్‌ ఇమ్మడి ప్రకటించారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమానికి సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్‌ఆర్‌ పాడేరు, రాజమహేంద్రవరం, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన విద్యుత్‌ వినియోగదారులు 86884 00499 ఫోన్‌ నంబర్‌ ద్వారా విద్యుత్‌ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చని వెల్లడించారు. విశాఖపట్నం ఏపీఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయాలు, హెచ్చుతగ్గులు, కొత్త సర్వీసుల జారీలో, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్‌న్స్‌ఫార్మర్ల మార్పిడి, తదితర విద్యుత్‌ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సంస్థ పరిధిలోని 11 జిల్లాల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు 1
1/1

ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement