ద్వాదశ గ్రంథావిష్కరణ మహోత్సవం
సీటీఆర్‌ఐ: రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాల్‌లో సాహితీ గౌతమీ వ్యవస్థాపకుడు పి.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ సంగాడి వీర రాఘవేంద్రరావు రచించిన 12 గ్రంథాలను ప్రముఖ సాహితీవేత్తలు ఆదివారం ఆవిష్కరించారు. అలాగే గ్రంథకర్త సంగాడి వీర రాఘవేంద్రరావు, భార్య కామేశ్వరికి సహస్ర చంద్రదర్శన మహోత్సవం జరిగింది. విజయ్‌కుమార్ మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు – వాహన వైభవాలు, ఉగ్ర – శాంతి, సాహితీ మంజూష, గోష్ఠీ పత్ర స్రవంతి, మనసిక్కిం, కరోనా కథ, పుడమీ తల్లి, ప్రసంగ తరంగణి – 2, ద్రాక్షారామ క్షేత్ర సాహిత్య సమీక్ష, ప్రసంగ తరంగణి – 1, కబీరు బోధనామృతం వంటి అత్యుత్తమ గ్రంథాలను రచించిన వీర రాఘవేంద్రరావు అభినందనీయుడన్నారు. కార్యక్రమంలో మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆదిత్య సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, డాక్టర్ బీహెచ్‌వీ రమాదేవి, జీఎన్‌మూర్తి, డాక్టర్ అరిపిరాల నారాయణరావు, తాతా సందీప్‌శర్శ పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.


