అరణ్యరోదన | - | Sakshi
Sakshi News home page

అరణ్యరోదన

Feb 23 2026 7:33 AM | Updated on Feb 23 2026 7:33 AM

అరణ్య

అరణ్యరోదన

అంతుచిక్కని కారణాలు?

ఈ గ్రామ ప్రజల అవసరార్థం మూడు రక్షిత మంచి నీటి పథకాలు ఉన్నారు. అలాగే 20 చేతి పంపులు ఏర్పాటు చేశారు. తాగునీటి కుళాయిల ద్వారా వచ్చిన నీటిని వాడకానికి, చేతిపంపుల నీటిని తాగేందుకు వాడుతున్నారు. ట్యాంకు నీటిని క్లోరినేషన్‌ చేయకపోవడంతో తాగేందుకు వినియోగించడం లేదు. చేతిపంపు నుంచి వచ్చిన నీటిని రెండు రోజులు నిల్వ ఉంచుకుంటే అడుగు భాగాన శుద్ధగా వస్తుందని ప్రజలు అంటున్నారు. ఇది వ్యాధులకు కారణమని ప్రజలు చెబుతున్నారు. నీటి పరీక్షలు చేస్తే అసలు కారణాలు తెలుస్తాయి.

గిరిజనులకు ‘అరణ్య’రోదనే మిగిలింది..

చంద్రబాబు సర్కారు పట్టించుకోక ఉర్లాకులపాడు మరో ఉద్దానంలా మారుతోంది.. ఫలితంగా ఏడాదిన్నరగా మృత్యుఘంటిక మోగుతోంది.. కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆ పల్లెలో జనం సతమతమవుతున్నా ఎవరికీ పట్టకుంది.. అసలు వ్యాధులకు కారణాలేంటో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కనీసం మెరుగైన వైద్యం అందించడంలోనూ ప్రభుత్వం విఫలం అవుతోంది.. ఆ మరణ మృదంగం గురించి తెలుసుకుందాం రండి..

రాజవొమ్మంగి: ఉర్లాకులపాడు.. రాజవొమ్మంగి మండలంలో ఓ కుగ్రామం. మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది రాజవొమ్మంగి– ఏలేశ్వరం ప్రధాన రహదారిని ఆనుకుని ఉంటోంది. ఈ గ్రామంలో 185 కుటుంబాలు, 701 మంది జనాభా ఉన్నారు. ఇక్కడంతా ఆదివాసీలు (కొండరెడ్డి) నివసిస్తున్నారు. ఏం జరుగుతుందో గాని ఇక్కడి గిరిజనులు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలా ఏడాదిన్నగా పది మందికి పైగా మృత్యువాత పడ్డారని గిరిజనులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ ఆరోగ్యం గురించి కనీసం పట్టించుకునే వారే లేకపోయాయని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం దృష్టికి వెళ్లకపోవడం విచారకరమని సర్పంచ్‌ తొంటా ఆదిరాజు అన్నారు. ప్రజాప్రతినిధిని అయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని ఆయన బాధను వ్యక్తం చేశారు.

ఒక్కసారిగా మంచాన పడి..

కోసూరి తమ్మారావు ( 47) గత ఏడాది డిసెంబర్‌లో ఒక్కసారిగా మంచాన పడ్డాడు. వ్యవసాయం కూలీగా ఉంటూ కుటుంబానికి ఆధారమైన అతను కిడ్నీ సమస్య బారిన పడ్డాడు. అతనికి భార్య భద్ర, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లలను చదివించుకుంటూనే తన భర్తను డయాలసిస్‌ కోసం, వారానికి మూడు సార్లు వంద కిలోమీటర్ల దూరంలోని కాకినాడకు తీసుకు వెళ్తున్నట్లు భద్ర చెబుతోంది. ఇందుకు గాను నెలకు రూ.7,200 ఖర్చు అవుతోందని తెలిపింది. ఇలా గత 13 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నట్లు కన్నీటి పర్యంతం అయ్యింది. యజమాని మంచాన పడడంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని వివరించింది. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంది. అనేక మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో మందులు వేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కాని, ప్రభుత్వ పెద్దలు కాని కనీసం పట్టించుకోకపోవడం శోచనీయం. అసలు సమస్య ఎందువల్ల వచ్చిందనే దానిపై ఇంకా ఓ అంచనాకు రాకపోవడం దారుణం.

వెలుగులోకి రావడంతో..

ఉర్లాకులపాడులో కిడ్నీ సమస్యతో పలువురు మృత్యువాత పడ్డారన్న విషయం వెలుగు చూడడంతో అధికారులు శుక్ర, శనివారాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం 43 మందికి రక్త పరీక్షలు చేసి కాకినాడ ల్యాబ్‌కు పంపగా, ఆరుగురికి అసాధారణ ఫలితాలు వచ్చాయని రంపచోడవరం నుంచి వచ్చిన డాక్టర్‌ డేవిడ్‌ అన్నారు. వీరిని తదుపరి పరీక్షల నిమిత్తం సోమవారం ప్రత్యేక వాహనంలో కాకినాడకు తరలిస్తామన్నారు. శనివారం మరో 66 మందికి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపామన్నారు. ఈ గ్రామంలో సంభవిస్తున్న మరణాలకు కారణం ఏంటో తప్పకుండా కనుగొని తక్షణ వైద్య సహాయం అందజేస్తామని రంపచోడవరం నుంచి వచ్చిన ఆర్‌బీఎస్‌కే – ఎన్‌సీడీసీడీ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ నాగార్జున ‘సాక్షి’తో అన్నారు.

ఫ ఉర్లాకులపాడులో మృత్యుఘోష

ఫ కిడ్నీ సమస్యలతో గ్రామస్తులు

ఫ ఏడాదిన్నరగా ఆగని ఆక్రందనలు

ఫ పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

ఏ ఒక్కరూ పట్టించుకోలేదు

ఉర్లాకులపాడులో అనారోగ్య సమస్యలను ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. మరణాలు వెలుగు చూస్తుండడంతో ఇప్పుడు వచ్చి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మా గ్రామంలో ఎంతో మంది మరణించారు. కుటుంబ యజమాని చనిపోవడంతో వీధిన పడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఎంతో బాధాకరం.

– కోసూరి భద్ర, ఉర్లాకులపాడు

కష్టకాలం నుంచి ఆదుకోవాలి

మా గ్రామంలో కిడ్నీ సమస్యల కారణంగా డయాలసిస్‌ చేయించుకుంటూ మరణించిన వారి సంఖ్య 20కి పైనే ఉంటోంది. ఇందులో పెళ్లికాని యువకులూ ఉన్నారు. భార్య, పిల్లలు ఉన్న పురుషులు ఉన్నారు. నేటికి ఉర్లాకులపాడులో అనేక మంది అనారోగ్యంతో మంచాన పడ్డారు. మా గ్రామాన్ని ఈ కష్టకాలం నుంచి ప్రభుత్వం ఆదుకోవాలి.

– కోసూరి బూరమ్మ

నమూనాలు సేకరిస్తున్నాం..

ఈ గ్రామంలో మూడు రక్షిత మంచి నీటి పథకాలు, మరో 20 చేతి పంపులున్నాయి. చేతి పంపు నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారని తెలుసుకున్నాం. ఆ నీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపాం. నీటి కారణంగా వ్యాధులు సంభవిస్తున్నాయా? ఇతర కారణాలు ఉన్నాయా అనేదానిపై అధ్యయనం చేస్తున్నాం. ఉర్లాకులపాడులో సాధారణ పరిస్థితులు వచ్చేలా కృషి జరుగుతోంది.

– డేవిడ్‌ ప్రభుత్వ వైద్యాధికారి, రంపచోడవరం

అరణ్యరోదన1
1/3

అరణ్యరోదన

అరణ్యరోదన2
2/3

అరణ్యరోదన

అరణ్యరోదన3
3/3

అరణ్యరోదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement