బస్సు ఢీకొని వ్యక్తి మృతి
ముగ్గురికి గాయాలు
ఆత్రేయపురం: మండలం వద్దిపర్రు వద్ద బొబ్బర్లంక నుంచి వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా అందులో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానిక ఎస్సై ఎస్.రాము కథనం ప్రకారం శనివారం ఉదయం బొబ్బర్లంక వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వద్దిపర్రు గ్రామ సమీపంలో ఆటోను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా వైద్య నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న నెల్లూరు జిల్లా కావలి గ్రామానికి చెందిన చేబ్రోలు పురుషోత్తం రావు(60) తలకు బలమైన గాయం కావడం వల్ల చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.


