మహిళపై కత్తితో దాడి
సామర్లకోట: కొంత కాలంగా తనతో సహజీవనం చేస్తున్న మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటనపై కేసు నమోదైంది. స్థానికుల కథనం ప్రకారం స్థానిక రైల్వే స్టేషన్‌లో సమోసాలు విక్రయించే కాయ రాజుతో స్టేషన్‌లో పువ్వులు విక్రయించే లక్ష్మి ఏడాదిగా సహజీవనం చేస్తోంది. స్థానిక సత్యనారాయణపురంలో ఒక అద్దె ఇంటిలో రాజు నివసిస్తున్నాడు. నర్సీపట్నానికి చెందిన లక్ష్మి ప్రతి మూడు రోజులకు రాజు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం హోటల్ నుంచి భోజనం తెచ్చుకుని ఇద్దరు ఇంటిలోకి వెళ్లిన తరువాత కేకలు వినిపించాయి. అంతలోనే రాజు రక్తం వస్తున్న కత్తితో రైలు పట్టాలపై నుంచి పరుగుతీసి పారిపోయాడని స్థానికులు తెలిపారు. రాజు ఉంటున్న ఇల్లు కౌన్సిలర్ సేసెని సురేష్‌కు చెందినది కావడంతో స్థానికులు ఆయనకు సమాచారం ఇచ్చారు. స్థానికులు, కౌన్సిలర్ ఇంటిలోకి వెళ్లి చూసే సరికి లక్ష్మి రక్తపు మడుగులో పడి ఉంది. కౌన్సిలర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లక్ష్మిని ఆటోలో సామర్లకోట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రెండు కాళ్లు నరికి వేయడంతో పాటు మెడపై కత్తి వేటు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో ఆమెకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లక్ష్మికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, భర్త వృద్ధుడు కావడంతో రాజుతో ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు. సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళపై కత్తితో దాడి
మహిళపై కత్తితో దాడి


