లారీ ఢీకొని బాలుడి మృతి
నిడదవోలు రూరల్: రెండు నెలలు క్రితం బిర్యానీ కోసం వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. బుధవారం రాత్రి ఆరేళ్ల కొడుకు బిర్యానీ కోసం వెళ్లి వస్తుండగా లారీ ఢీకొని మృతిచెందాడు. మునిపల్లికి చెందిన అత్తిలి నాగరాజు అక్టోబర్ 17న మరణించాడు. కుమారుడు భరత్ మునిపల్లికి చెందిన చోళ్ల పద్మాకర్ బైక్‌పై కానూరు వెళ్లి బిర్యానీ తీసుకొస్తుండగా మునిపల్లి రామాలయం వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో పద్మాకర్‌కు స్వల్పగాయాలు కాగా.. రోడ్డు వైపు పడిన భరత్‌పై లారీ టైర్ ఎక్కడంతో తలభాగం నుజ్జనుజ్జై ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. దీంతో తల్లి దుర్గాభవానితో పాటు కుటుంబీకులు గుండెలువిసేలా రోదించారు. భరత్ కానూరులోని ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. సమిశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందరరావు ఘటనాస్థఽలాన్ని పరిశీలించి బాలుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మేడపాటికి ‘కామధేను’ పురస్కారం
పెదపూడి: ఢిల్లీలోని విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ వైద్య శాస్త్రంలో విశేష సేవలు చేసిన వారికి అందజేసే కామధేను ఇంటర్నేషనల్ అవార్డు 2025కు తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామానికి చెందిన రాజవైద్యుడు, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ, సినీ నటుడు డాక్డర్ మేడపాటి భామిరెడ్డి ఎంపికై య్యారు. మేరకు సంస్థ చైర్మన్, ఎండీ సత్యవోలు రాంబాబు ఇటీవల హైదరాబాద్‌లో ప్రకటించారు. ఆయన బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల మేరకు విశ్వగురు వరల్డ్ రికార్డు జాబితాలో తన పేరు నమోదు చేశారన్నారు. జనవరి 7న తిరుపతిలో ఈ అవార్డు ప్రదానం చేస్తారన్నారు. తాను 25 ఏళ్లుగా ఆయుర్వేద వైద్యంలో విలువైన నవరత్నాల భస్మాల రాజవైద్యంతో దేశ విదేశాలల్లోని ఎందరికో దీర్ఘకాలిక రోగాలు నయం చేశానన్నారు.
ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్‌ఐవోగా శారద
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా ఇంటర్‌బోర్డు రీజినల్ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్‌గా (ఆర్‌ఐవో) ఐ.శారద నియమితులయ్యారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కమిషనరేట్ నుంచి ఆమెకు బుధవారం ఉత్తర్వులు అందాయి. రాజమహేంద్రవరంలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆమె గురువారం విధుల్లో చేరనున్నారు. ఆమె ఇప్పటి వరకు కాకినాడ జిల్లా డీవీఈవో గా పని చేశారు. గతంలో జోన్ 2 పరిధిలో ఇంటర్‌బోర్డు ఆర్జేడీగా విధులు నిర్వర్తించారు. శారద నియామకంపై జిల్లాలోని అధ్యాపకులు, కళాశాల యాజమాన్యాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
లారీ ఢీకొని బాలుడి మృతి


