అనుమానాస్పద మృతిపై విచారణ
కాకినాడ క్రైం: కాకినాడలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. మల్లయ్య అగ్రహారానికి చెందిన కుడుపూడి సత్యనారాయణ(29) ఈ నెల 22న అర్థరాత్రి ఇంట్లో దుప్పటితో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేళాడుతూ ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. చేతులు వెనక్కి కట్టేసి ఉండడంతో పాటు మరి కొన్ని కారణాల నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కుటుంబసభ్యులు భావించారు. ఈ అంశాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా, మృతిపై విచారణ కొనసాగుతోందని సీఐ మజ్జి అప్పలనాయుడు తెలిపారు. సత్యనారాయణకు తల్లిదండ్రులు లేరు. బాబాయి, పిన్నే కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. పెయింటింగ్ పనిచేసే సత్యనారాయణ కుటుంబసభ్యులతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో అతడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతిపై లోతైన విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని పోలీసుల్ని కోరుతున్నారు.
జాతీయ స్థాయి జు – జుట్సు
పోటీల్లో రవి శంకరికి రజతం
అమలాపురం టౌన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం హాల్ద్వానీలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకూ జరిగిన జాతీయ స్థాయి జు – జుట్సు చాంపియన్ షిప్ –2025 పోటీల్లో అమలాపురానికి చెందిన అడపా రవి శంకరి రజిత పతకాన్ని సాధించింది. అండర్–16 విభాగంలో రవి శంకరి 48 కేజీల ఫైటింగ్ కేటగిరిలో విజేతగా నిలిచి పతకాన్ని కై వసం చేసుకుందని కోచ్‌లు పడాలి అంజి, చిక్కం సురేష్ తెలిపారు. విజేతను అమలాపురం పవర్ కిక్ మార్షల్ ఆర్ట్స్ అకాడమి ప్రతినిధులు అభినందించారు.


