
విద్యుత్‌శాఖ సన్నద్ధం
కంట్రోల్‌రూమ్ ఏర్పాటు ఎస్‌ఈ తిలక్ కుమార్
రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో కురుస్తున్న వర్షాలు, రాబోయే మూడు రోజుల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో, జిల్లా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పర్యవేక్షక ఇంజినీర్ కె.తిలక్ కుమార్ గురువారం ఆదేశాలిచ్చారు. ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈపీ డీసీఎల్ చైర్మన్, కలెక్టర్ ఆదేశాల మేరకు, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు విద్యుత్ భవన్‌తో పాటు అన్ని డివిజన్ స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు
సెంట్రలైజ్డ్ టోల్ ఫ్రీ నెంబర్ : 1912
జిల్లా స్థాయి (రాజమహేంద్రవరం):
0883–2463354, 73822 99960
డివిజన్ స్థాయి : 94906 10093,
94391 78874, 8332 973595
ఈ కంట్రోల్ రూమ్‌లు 24 గంటల
విధానంలో పని చేయనున్నాయి.