
ఏకధాటిగా.. కుండపోత!
పెరవలి: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. మూడు గంటల పాటు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురిసిన ఈ వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయం కాగా, పలు కాలనీలు నీటమునిగాయి. జిల్లాలో అత్యధికంగా బిక్కవోలు మండలంలో 22.8 మిల్లీ మీటర్లు కురవగా, పెరవలి, రంగంపేట మండలాల్లో 4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో మొత్తంగా 44.8 మిల్లీ మీటర్ల వర్షం కురవగా సగటున 2.4 మిల్లీ మీటర్ల వర్షం పండింది. పాఠశాలల నుండి వచ్చే విద్యార్థులు వర్షం ధాటికి పాఠశాలల్లోనే ఉండి రాత్రి 8 గంటల తరువాత ఇళ్లకు చేరుకున్నారు. పొలం పనులు చేసే కూలీలు, రైతులు వర్షం తగ్గిన తరువాతే ఇళ్లకు చేరుకున్నారు.
ఇక చాగల్లు, నల్లజర్ల, నిడదవోలు, సీతానగరం, తాళ్లపూడి మండలాల్లో వర్షం కురవలేదు. గాలి లేకపోవటం వల్ల ఎక్కడ ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనల మేరకు బుధవారం నుంచి 18వ తేదీ వరకు వర్షాలు, గాలులు వంటి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో, అలాగే 10 మండలాలలో తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్.కృష్ణ నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈ కంట్రోల్ రూములు 24 గంటల విధానంలో పని చేస్తూ, ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సాయం అందించేందుకు సిద్ధంగా ఉంటాయన్నారు. ప్రజలు సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్లలో సంప్రదించవచ్చు.
జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ : 8977935611
సబ్ కలెక్టర్ కార్యాలయం : 0883–2442344
అనపర్తి : 9441386920
బిక్కవోలు : 9849903913
గోకవరం : 9491380560
కడియం : 9490884561
కొవ్వూరు : 9866778416
రాజమహేంద్రవరం రూరల్ : 0883–2416005
రాజమహేంద్రవరం అర్బన్ : 0883–2940695
రాజానగరం : 9494546001
రంగంపేట : 9177824924
సీతానగరం : 9177096888
మండలాల వారీగా వర్షపాతం..
మండలం మిల్లీ మీటర్లు
బిక్కవోలు 22.8
రంగంపేట 4.0
పెరవలి 3.8
రాజానగరం 2.4
ఉండ్రాజవరం 2.2
గోకవరం 2.0
రాజమండ్రి రూరల్ 1.4
కొవ్వూరు 1.2
రాజమండ్రి అర్బన్ 1.2
అనపర్తి 1.0
కోరుకొండ 1.0
గోపాలపురం 0.8
కడియం 0.8
దేవరపల్లి 0.2
3 గంటల పాటు కురిసిన వర్షం
పల్లపు ప్రాంతాలు జలమయం