
మోటార్ సైకిళ్ల దొంగ అరెస్టు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): వరుస మోటార్ సైకిళ్ల చోరీ కేసుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం సెంట్రల్ జోన్ డీఎస్పీ కె.రమేష్‌బాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇటీవల జిల్లాలో ఎక్కువైన మోటార్ సైకిళ్ల చోరీలపై పోలీసులు దృష్టి సారించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పోలీసు అధికారులకు నిర్దేశించారు. ప్రకాశ్‌నగర్ సీఐ బాజీలాల్ ఆధ్వర్యంలో బృందం నిఘా పెట్టింది. ఆర్టీవో కార్యాలయం సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా, కాకినాడ గాంధీనగర్‌కు చెందిన ఇంటి సురేంద్ర అనుమానాస్పదంగా పట్టుబడ్డాడు. అతడిని విచారణ చేయగా, జిల్లావ్యాప్తంగా బైక్ చోరీలు చేస్తూ, మరో వ్యక్తికి ఇస్తున్నట్టు చెప్పాడు. అతడిచ్చిన సమాచారంతో పిఠాపురానికి చెందిన కామిరెడ్డి ఏసుబాబును పోలీసులు అరెస్టు చేశారు. 2003 నుంచి సురేంద్ర బైక్ చోరీలు చేస్తున్నాడు. అతడిపై అనకాపల్లి, రామచంద్రపురం, కాకినాడ, పామర్రు పోలీస్ స్టేషన్లలో పలు కేసులున్నాయి. అతను బైక్ చోరీ చేస్తూ చివరిసారిగా గతేడాది రామచంద్రపురం పోలీసులకు పట్టుబడ్డాడు. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చి తిరిగి దొంగతనాలు ప్రారంభించాడు. అతడికి స్టిక్కరింగ్ పని చేసే ఏసుబాబు పరిచయమయ్యాడు. ఖరీదైన బుల్లెట్లు, స్పోర్ట్ బైక్‌లు, స్కూటర్లను చోరీ చేసి, ఏసుబాబు ద్వారా సురేంద్ర అమ్మించేవాడు. రాజమండ్రి ప్రకాష్‌నగర్, త్రీటౌన్, బొమ్మూరు, కడియం, గోకవరం, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం పోలీస్‌స్టేషన్ల పరిధిలో దొంగిలించిన మొత్తం రూ.19 లక్షల విలువైన 18 వాహనాలను పోలీసులు రివకరీ చేశారు. నిందితులను పట్టుకున్న సీఐ బాజీలాల్, ఎస్సై జి.సతీష్, హెచ్‌సీ వి.నాగరాజు, సీహెచ్ శ్రీనివాసరావు, క్రైమ్ పోలీసులు కె.ప్రదీప్‌కుమార్, వీరబాబు, దుర్గప్రసాద్, శివప్రసాద్‌ను ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.
పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు రద్దు చేయాలి
రాజానగరం: అధికార బలంతో ఏకపక్షంగా జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు రద్దు చేసి, కేంద్ర బలగాల రక్షణలో ప్రజాస్వామ్య బద్ధంగా తిరిగి నిర్వహించాలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు అడబాల చినబాబు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, పోలీ సు బలగాలను దుర్వినియోగపర్చి, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి నిర్వహించిన ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా నిలుస్తాయన్నారు. ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్నా కనికరించకపోవడం ఇందుకు ఉదాహరణగా వ్యాఖ్యానించారు.
● విక్రయించిన నిందితుడు కూడా.. ● 18 వాహనాలు స్వాధీనం

మోటార్ సైకిళ్ల దొంగ అరెస్టు