
29న ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు
అమలాపురం టౌన్: నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ నెల 29న అమలాపురంలోని ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్‌లో నాలుగో యునైటెడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అల్లాడ శరత్‌బాబు తెలిపారు. పోటీల పోస్టర్లను స్థానిక ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్‌లో సంఘ, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ల ప్రతినిధులు బుధవారం ఆవిష్కరించారు. ఉభయ గోదావరి జిల్లాల స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు దాదాపు 200 మంది పవర్ లిఫ్టర్లు హాజరవుతారని శరత్‌బాబు తెలిపారు. సబ్ జూనియర్స్, సీనియర్స్, మాస్టర్స్ (పురుషులు, మహిళలు) విభాగాల్లో మొత్తం 30 కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నట్టు సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి వివరించారు. విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు, ఒలింపిక్ పతకాలను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి ప్రొఫెసర్ గోకరకొండ నాగేంద్ర, ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ కార్యదర్శి తిక్కిరెడ్డి శ్రీనివాసరావు, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, పవర్ లిఫ్టింగ్ పోటీల ఆర్గనైజర్, కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు, సంఘ ప్రతినిధులు కల్వకొలను బాబు, తిక్కిరెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు.