
వర్జీనియా మరింత కుంగి!
గోపాలపురం: అంతర్జాతీయంగా వర్జీనియా పొగా కు ధరలు రోజు రోజుకూ దిగిపోతుండటం, నాలుగు రోజుల్లో కిలోకు రూ.20 పడిపోవడంతో రైతులు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. బుధవారం స్థానిక పొగాకు వేలం కేంద్రానికి వచ్చిన 1376 బేళ్లకు 1207 బేళ్లు కొనుగోలు చేయడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కిలోకు రూ.351 పలికిన పొగాకు బధవారం రూ.331కు పడిపోవడం, మేలు రకం పొగాకు మాత్రమే కంపెనీలు కొనుగోలు చేస్తూ మిగిలిన గ్రేడ్‌ను పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వాదాలకుంట, వెదుళ్లకుంట గ్రామాల పొగాకు మేలు రకంగా భావిస్తుంటారు. దానికి కూడా సరైన ధర రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గరిష్ట ధర రూ.350, కనిష్ట ధర రూ.200, సరాసరి ధర రూ.331.26 పైసలు పలికింది. బుధవారం సరాసరి ధర రూ.299.83 పైసలు 14 పొగాకు కంపెనీలు వేలంలో పాల్గొన్నట్లు వేలం నిర్వాహణాధికారి కేవల్ రామ్ మీనా తెలిపారు. 116 రోజుల పొగాకు కొనుగోళ్లలో 92.70 మిలియన్ పొగాకు కొనుగోళ్లు జరిగాయన్నారు.
ధర పడిపోయి రైతు కుదేలు