
ఆరు నెలలు తాగితే జీవితకాలపు భరోసా
తల్లి పాలు బిడ్డకు ఆరు నెలలు పట్టిస్తే యావత్ జీవిత కాలం రోగనిరోధక శక్తి లభిస్తుంది. మరే ఆహారం వల్లా ఇంతటి ప్రయోజనం సాధ్యం కాదు. అధికంగా పాలు ఉత్పత్తి అయ్యే తల్లుల పాలు వృథా కాకుండా సేకరించడం, పాలు అందుకోలేకపోతున్న శిశువులకు అందించడమే మిల్క్ బ్యాంక్ విధి. తల్లిపాలందించి పసివాళ్లలో పోషకాహార లోపాన్ని రూపుమాపడమే లక్ష్యం. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్, పీడియాట్రిక్స్ హెచ్‌వోడీ డాక్టర్ మాణిక్యాంబ సహకారంతో సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. శిశువులకు పాలు కావాలనుకునే వారు, చనుబాలు దానం చేయాలనుకునే తల్లులు జీజీహెచ్‌లోని ఽమిల్క్ బ్యాంక్ ప్రతినిధులను సంప్రదించవచ్చు.
– డాక్టర్ ఆమంచర్ల హర్షవర్దన్, ఽ
దాత్రి మిల్క్ బ్యాంక్ కాకినాడ ఇన్‌చార్జి
జీజీహెచ్ నుంచి
పూర్తి సహాయ సహకారాలు
ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీజీహెచ్‌లో నిర్వహిస్తున్న మిల్క్ బ్యాంక్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నాం. పీడియాట్రిక్స్ హెచ్‌వోడీ డాక్టర్ మాణిక్యాంబ ఈ సేవలను పర్యవేక్షిస్తున్నారు. డాక్టర్ హర్షవర్దన్, మేనేజర్ మాధవ్ సంస్థ తరఫున ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తూ తల్లులు, శిశువులకు ఎనలేని సేవలు అందిస్తున్నారు. అధునాతన పరికరాలతో శాసీ్త్రయ విధానాలను అనుసరిస్తూ పాలు శుద్ధి చేసి భద్రపరచడంలో నాణ్యతను కొనసాగిస్తున్నారు.
– డాక్టర్ ఎంపీఆర్.విఠల్,
ఇన్‌చార్జి సూపరింటెండెంట్, జీజీహెచ్

ఆరు నెలలు తాగితే జీవితకాలపు భరోసా