● ఇక దగ్గర పంటుగే | - | Sakshi
Sakshi News home page

● ఇక దగ్గర పంటుగే

Dec 30 2025 7:42 AM | Updated on Dec 30 2025 7:42 AM

● ఇక

● ఇక దగ్గర పంటుగే

యమడేంజరే మరి

పూత వేసి.. కనువిందు చేసి

హెల్మెట్‌ ధరిస్తారా.. నా దగ్గరకు వస్తావా అంటూ వాహనదారులను యమ ధర్మరాజు వేషధారణలో ఓ కళాకారుడు హెచ్చరిస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణపై చేపట్టిన అవగాహన కార్యక్రమం ఆకట్టుకుంది. జిల్లా ఎస్పీ బింధుమాధవ్‌ ఆదేశాలతో స్థానిక సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కళాకారులు యమ ధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణతో జగ్గంపేట ప్రధాన రోడ్డుపై ప్రజలల్లో ఇలా అవగాహన నింపారు.

– జగ్గంపేట

మామిడికి పూత వచ్చేసింది.. ఆ చెట్లకు కళ తెచ్చింది.. పాశర్లపూడిబాడవలోని 216 జాతీయ రహదారి పక్కన ఉన్న నిమ్మల అప్పారావు ఇంటి ప్రాంగణంలో మామిడిచెట్టు ఇలా పూత పూసింది. చెట్టుకు ఉన్న ఆకుల కన్నా పూతతో నిండుగా కనిపిస్తోంది. ఆ మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరికీ కనువిందు చేస్తోంది. దేశవాళీ రకానికి చెందిన ఈ మామిడి చెట్టు ప్రతి ఏడాది ఇదే విధంగా పూత పూసి కాయలు కాస్తోందని అప్పారావు తెలిపారు.

– మామిడికుదురు

కోటిపల్లి – ముక్తేశ్వరం మధ్య పంటు ప్రయాణం సోమవారం నుంచి పునః ప్రారంభించారు. ఈ ఏడాది జూలైలో గోదావరికి వరదల కారణంగా మూతపడింది. అప్పటి నుంచి అమలాపురం వెళ్లాల్సిన ప్రయాణికులు సుమారు 54 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో వెళ్లేవారు. పంటు ప్రయాణం ప్రారంభించడంలో కేవలం 15 కిలోమీటర్లు వెళ్తే సరిపోతుందని ఆనందిస్తున్నారు.

– కె.గంగవరం

● ఇక దగ్గర పంటుగే1
1/2

● ఇక దగ్గర పంటుగే

● ఇక దగ్గర పంటుగే2
2/2

● ఇక దగ్గర పంటుగే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement