ఇదో మంచి అలవాటు
చిన్నప్పటి నుంచి డైరీ రాసే అలవాటు ఉంది. ఉద్యోగం వచ్చే వరకూ పర్సనల్ డైరీ రాసేవాడిని. ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించిన డైరీ రాస్తున్నాను. ఇలా రాయడం వల్ల మనం చేసే పనులను సమీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరీ రాయడం మంచి అలవాటు.
– బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం
గతం నెమరు వేసుకునేలా..
చిన్నతనం నుంచి విద్యార్థులకు డైరీ రాయడం అలవాటు చేయాలి. గత అనుభవాలు నెమరువేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. మర్చిపోయిన విషయాలను డైరీ చూసి తెలుసుకోవచ్చు. ఇది అందరికీ ఉపయుక్తం. నేనూ డైరీ రాస్తుంటాను. – పి.నాగేశ్వరరావు,
డీఈఓ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ
ఇదో మంచి అలవాటు


