పంచారామాలకు ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

పంచారామాలకు ప్రత్యేక బస్సులు

Nov 14 2026 12:59 AM | Updated on Nov 14 2026 12:59 AM

అమలాపురం రూరల్‌: కార్తిక మాసం సందర్భంగా పంచారామ క్షేత్ర దర్శనంతో పాటు శబరిమలకు స్పెషల్‌ బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ అమలాపురం డిపో మేనేజర్‌ ఐ.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. పంచారామ క్షేత్ర స్పెషల్స్‌ నవంబర్‌ 15, 22, 29, డిసెంబర్‌ 6వ తేదీల్లో రాత్రి 8 గంటలకు అమలాపురంలో బయలుదేరుతాయన్నారు. ఇవి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట క్షేత్రాల దర్శనానంతరం మర్నాడు రాత్రి 8 గంటలకు అమలాపురం చేరుకుంటాయని తెలిపారు. బస్సుకు సరిపడా భక్తులుంటే వారు కోరిన ఏ రోజైనా ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపరు. అలాగే, శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు వారు కోరుకున్న చోటు నుంచి కోరుకున్న క్షేత్రాలకు తీసుకెళ్లేందుకు 6 రోజులు, 7 రోజుల యాత్రకు స్పెషల్‌ బస్సులు ఇస్తామని వివరించారు. స్పెషల్‌ బస్సుల కోసం 9959 22 5550తో పాటు రిజర్వేషన్‌ 9959 22 5576, 70138 68687, 73829 09620, 99088 36444 నంబర్లలో సంప్రదించాలని ప్రేమ్‌కుమార్‌ కోరారు.

ఫిర్యాదుల పరిష్కారంపై

ఫీడ్‌బ్యాక్‌ పోర్టల్‌

అమలాపురం రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రజలు తమ అభిప్రాయం తెలిపేందుకు ప్రభుత్వం పీజీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిందని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ తెలిపారు. దీనికోసం రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా లేదా ఆన్‌లైన్‌లో https://pgrs.ap.gov.in/Home/ QR Grievance Feedback పీజీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు నమోదు చేయవచ్చని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement