జగన్‌ కుటుంబ సభ్యులపై దూషణలను సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

జగన్‌ కుటుంబ సభ్యులపై దూషణలను సహించేది లేదు

Nov 14 2026 12:59 AM | Updated on Nov 14 2026 12:59 AM

సాక్షి, అమలాపురం: రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను, ముఖ్యంగా కుటుంబాల్లోని మహిళలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని వైఎస్సార్‌ సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు తోరం గౌతమ్‌రాజ్‌ స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు సినీ నటులు అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబాలకు చెందిన మహిళలపై సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దీనిపై, ఆయన ఆధ్వర్యాన పార్టీ నాయకులు శుక్రవారం అమలాపురం సీఐ పి.వీరబాబుకు ఫిర్యాదు చేశారు. తోరం మాట్లాడుతూ, సోషల్‌ మీడియా ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే వేదిక మాత్రమేనని, ఇతరుల వ్యక్తిత్వాన్ని, కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసే వేదికగా మారకూడదని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ నాయకులు తిక్కా వెంకట ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement