న్యుమోనియా నుంచి చిన్నారులను రక్షించాలి | - | Sakshi
Sakshi News home page

న్యుమోనియా నుంచి చిన్నారులను రక్షించాలి

Nov 13 2026 12:22 AM | Updated on Nov 13 2026 12:22 AM

అమలాపురం టౌన్‌: న్యుమోనియా వ్యాధి బారిన పడకుండా ఐదేళ్లలోపు చిన్నారులను రక్షించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) ఎం.దుర్గారావుదొర వైద్య సిబ్బందికి సూచించారు. ప్రపంచ న్యుమోనియా నివారణ దినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సోషల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ యాక్షన్‌ టు న్యూట్రలైజ్‌ న్యుమోనియా సక్సెస్‌ఫుల్లీ (ఎస్‌ఏఏఎన్‌ఎస్‌) కార్యక్రమాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయాధికారి (డీసీహెచ్‌ఎస్‌) కార్తిక్‌ మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మొదలైన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం జిల్లాలోని రెండు ఏరియా ఆస్పత్రులు, ఏడు కమ్యూనిటీ ఆస్పత్రులు, 49 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో నిరంతరా యంగా కొనసాగుతుందని జిల్లా వ్యాధి నిరోధక టీకా ల అధికారి బీవీవీ సత్యనారాయణ, జిల్లా ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ అధికారి టీకే శ్రీనివాస్‌ తెలిపారు. జాతీ య టీకాల కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు 6 వారాలు, 14 వారాల వయస్సులో పీసీవీ టీకా మోతా దులు, 9 నెలల వయస్సులో బూస్టర్‌ డోసు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉంటాయని వైద్యాధికారులు వివరించారు. అనంతరం ఈ కార్యక్రమం పోస్టర్లను వారు ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement