పంటగ దూరమాయె! | - | Sakshi
Sakshi News home page

పంటగ దూరమాయె!

Nov 7 2026 12:12 AM | Updated on Nov 7 2026 12:12 AM

● ‘వరి’గిపోయిన రైతన్న ఆశలు

● కానరాని పంట నష్టం అంచనాలు

● పట్టించుకోని చంద్రబాబు సర్కారు

ఆలమూరు: ఈదురుగాలులు, భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి.. వరుస తుపాన్లు దెబ్బ మీద దెబ్బ తీశాయి.. పంట చేతికొస్తే దీపావళి పండగ వెలుగులు వస్తాయని భావించిన రైతన్నలకు కష్టాలే మిగిల్చాయి.. ఆరుగాలం పండించిన పంట అన్నదాత చేతికి వచ్చేలోపే నోటికందకుండా పోయి.. కష్టాలు తెచ్చిపెట్టాయి. ఇలాంటి తరుణంలో సాయంగా నిలవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. తుపాను వచ్చి పది రోజులు అవుతున్నా, పంట నష్టం అంచనాలు నిర్ధారించి అప్పుల్లో కూరుకుపోయిన రైతన్నలను ఆదుకోవాల్సిన ఉండగా, ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ప్రభుత్వం అందించే పరిహారం మాట అటుంచితే, అంచనాలు రూపొందించి పంట నష్టం తేల్చి తుపాను బాధితులను ఇంకెప్పుడు ఆదుకుంటుందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మాదిరిగా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే, రైతులకు ఇంతటి సంకట పరిస్థితి వచ్చేది కాదని అంతటా అభిప్రాయం వ్యక్తమవుతుంది. గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన మొంథా తుపాను పరిహారం ఇప్పటివరకూ ఇవ్వలేదు. ఇప్పుడు అర్నబ్‌, మురసు తుపాన్లు విరుచుకుపడడంతో ఆ పరిహారాన్ని సక్రమంగా అందిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement