పి.గన్నవరం యువతికి మిసెస్‌ హైదరాబాద్‌ కిరీటం | - | Sakshi
Sakshi News home page

పి.గన్నవరం యువతికి మిసెస్‌ హైదరాబాద్‌ కిరీటం

Nov 7 2026 12:12 AM | Updated on Nov 7 2026 12:12 AM

పి.గన్నవరం: ఫ్యాషన్‌ రంగంలో ప్రతిభను చాటుతున్న పి.గన్నవరం గ్రామానికి చెందిన ముత్తాబత్తుల రాజశ్రీ వరంగల్‌లో తెలంగాణ ఫ్యాషన్‌ ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ‘తెలంగాణ స్పార్క్‌’ పోటీల్లో పాల్గొని ప్రతిష్టాత్మకమైన మిసెస్‌ హైదరాబాద్‌ టైటిల్‌ను కై వసం చేసుకున్నారు. గ్రామంలోని నేలపూడివారిపేటకు చెందిన రాజశ్రీకి ఫ్యాషన్‌ రంగంపై ఉన్న ఆసక్తి ఆమెను ఈ పోటీల్లో పాల్గొనేలా చేసింది. మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ఆమె ప్రతిభను ప్రదర్శించి విజేతగా నిలిచారు. దీంతో నిర్వాహకులు ఆమెకు కిరీటాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. రాజశ్రీ హైదరాబాద్‌ స్థాయి టైటిల్‌ను సాధించడం పట్ల పి.గన్నవరం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

వలలో చిక్కుకున్న

కింగ్‌ కోబ్రా

గంగవరం: రైతు పొలంలో ఏర్పాటు చేసిన వలలో అరుదైన, విషపూరితమైన కింగ్‌ కోబ్రా చిక్కుకుంది. దీనిని అటవీ శాఖ సిబ్బంది సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. మొల్లేరు గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద రైతు జగదీష్‌కు చెందిన పొలంలో కోతుల నివారణ కోసం ఏర్పాటు చేసిన వలలో కింగ్‌ కోబ్రా చిక్కింది. గమనించిన రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఫోక్స్‌పేట అటవీ రేంజ్‌ అధికారి పి.శ్రీనివాస్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్నేక్‌ క్యాచర్‌ ఈశ్వర్‌ సహాయంతో వలలో చిక్కుకున్న కింగ్‌ కోబ్రాను పట్టుకున్నారు. పామును పరిశీలించి ఎటువంటి గాయాలు కాలేదని నిర్ధారించుకున్న అనంతరం దానిని అడ్డతీగల రిజర్వ్‌ ఫారెస్ట్‌లో విడిచిపెట్టినట్టు శ్రీనివాస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement