అంబాజీపేట: రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ముక్కామల జెడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థి గుంట్రు దినేష్ ప్రసాద్ ఎంపికయ్యారు. ప్రధానోపాధ్యాయుడు ఎం.హరిప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ ముత్యాల పవన్ కిషోర్ గురువారం ఈ విషయం తెలిపారు. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ క్రీడా ప్రాంగణంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు బుధవారం జరిగాయన్నారు. ఇందులో అండర్–19 బాలుర 75 కేజీల విభాగంలో దినేష్ ప్రసాద్ ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని చెప్పారు.
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారని తైక్వాండో సీనియర్ కోచ్‌లు పితాని త్రిమూర్తులు, భార్గవి శ్రీకళ తెలిపారు. కాకినాడలో జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ పోటీల బాలికల విభాగం 44 కేజీల కేటగిరీలో పి.చరణ్యశ్రీ, బాలుర విభాగం 68 కేజీల కేటగిరీలో ఆర్‌హెచ్‌వీ మూర్తి ప్రథమ స్థానం సాధించారన్నారు. పోటీలకు ఎంపికై న విద్యార్థులను ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులు అభినందించారు.


