అంతర్వేదిలో సంప్రదాయ దుస్తులు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

అంతర్వేదిలో సంప్రదాయ దుస్తులు తప్పనిసరి

Oct 2 2026 12:28 AM | Updated on Oct 2 2026 12:28 AM

సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించే స్వామివారి విశేష పూజా కార్యక్రమాల్లో ఈ నెల 11వ తేదీ నుంచి భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులతోనే పాల్గొనాలని ఈఓ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుదర్శన హోమం, నిత్యాభిషేకం, ఇతర విశేషాభిషేకాల్లో ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించిన వారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.

వెయిట్‌ లిఫ్టింగ్‌లో ప్రథమం

అయినవిల్లి: కాకినాడలో నిర్వహించిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో శానపల్లిలంక జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థి ఎస్‌కేఎస్‌ఎస్‌ మణికంఠ అండర్‌–17 విభాగంలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అతడిని ప్రధానోపాధ్యాయుడు జె.బాలకృష్ణ గురువారం సత్కరించారు. వ్యాయామోపాధ్యాయుడు బి.వెంకట్రావు ప్రోత్సాహంతో విద్యార్థి ఈ స్థాయికి చేరుకున్నాడని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement